
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నానమ్మ, నాన్న ఆస్పత్రి ముందు ఎందుకు ఏడుస్తున్నారో తెలియక దిక్కులు చూస్తున్న ఆ చిన్నారి అమాయక చూపులు అందరినీ కంటతడి పెట్టించాయి. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన దూలం వెంకటేశ్, సోని దంపతులకు నాలుగేళ్ల పాప రిత్విక ఉంది. సోని రెండో ప్రసవం కోసం ఈ నెల 4న నస్పూర్ ప్రాథమిక ఆస్పత్రికి వెళ్లింది. సాధారణ ప్రసవం కాగా బాబు జన్మించాడు.
కొద్ది సేపటికే అధిక రక్తస్రావమై ఆమె పరిస్థితి విషమించడంతో స్థానిక మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే బుధవారం చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యమే సోని మృతికి కారణమంటూ ఆస్పత్రి ముందు వెంకటేశ్ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. వారి పక్కనే ఉన్న రిత్విక అమాయకపు చూపులు అందరినీ కంటతడి పెట్టించాయి.