అందరినీ మోటివేట్‌ చేస్తావా? 

KTR Speaks With Rusthapur Shravani Over MLC Elections - Sakshi

రుస్తాపూర్‌ గ్రామ గ్రాడ్యుయేట్‌ శ్రావణితో ఫోన్‌లో మాట్లాడిన కేటీఆర్‌ 

తుర్కపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్‌ గ్రామానికి చెందిన గ్రాడ్యుయేట్‌ శ్రావణితో మంత్రి కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. గ్రామ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ అందరినీ మోటివేట్‌ చేస్తావా అని ప్రశ్నించారు. కేటీఆర్, శ్రావణి ఫోన్‌ సంభాషణ వారి మాటల్లోనే.. 
కేటీఆర్‌: హలో.. శ్రావణియేనా మాట్లాడేది? 
శ్రావణి: అవును సార్‌ శ్రావణిని మాట్లాడుతున్న.. నమస్కారం సార్‌ 
కేటీఆర్‌: నమస్కారమమ్మా.. నేడు చెప్పింది అంతా విన్నావా.. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? 
శ్రావణి: అనుమానాలు అట్లాంటివి ఏమీ లేవు సార్‌. మీరు చేసే అభివృద్ధి పనులు చూసి, నా వంతుగా నేను ఎందుకు చేయవద్దు అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రామ ఇన్‌చార్జిగా తీసుకొని ముందుకు వచ్చాను సార్‌. 
కేటీఆర్‌: థాంక్యూ బేటా.. థాంక్యూ వెరీమచ్‌. ఇదే స్ఫూర్తిని పది మందిలో నింపు. మీది రుస్తాపూర్‌ కదా.. 
శ్రావణి: అవును సార్‌. 
కేటీఆర్‌: రుస్తాపూర్‌లో ఎంత మంది ఓటర్లు ఉంటారు. 
శ్రావణి: 40, 50 మంది ఓటర్లు ఉంటారు సార్‌. 
కేటీఆర్‌: అందర్నీ మోటివేట్‌ చేస్తావా? 
శ్రావణి: అందర్నీ మోటివేట్‌ చేస్తా.. షూర్‌గా.. 
కేటీఆర్‌: తప్పకుండా.. 
శ్రావణి: తప్పకుండా చేస్తాను సార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top