హామీలు నెరవేర్చండి | KTR To PM Modi: Honour Your Promises | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చండి

Jan 31 2022 3:50 AM | Updated on Jan 31 2022 9:23 AM

KTR To PM Modi: Honour Your Promises - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్ర వార్షిక బడ్టెట్‌ –2022ను ప్రవేశ పెడుతున్న వేళ, 2022 నాటికి పలు లక్ష్యాలు నెరవేరుస్తామంటూ దేశానికి ప్రధాని మోదీ చేసిన హామీలను గుర్తు చేయాలనుకుంటున్నా’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘మీ దూరదృష్టి వాస్తవ రూపందాల్చేలా బడ్జెట్‌ కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నా’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

2022 నాటికి ప్రతీ భారతీయుడికి సొంత ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతీ ఇంటికి తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు.. అంటూ గతంలో ప్రధాని చేసిన ప్రకటనలకు సంబంధించిన క్లిప్పింగులను తన ట్వీట్‌కు జత చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు సమకూరుస్తున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టం, నీతి ఆయోగ్‌ చేసిన సూచనలు గౌరవిస్తూ మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. కంటోన్మెంట్‌ ఏరియాలో రోడ్ల వెడల్పుకు సంబంధించి ఆరేళ్లుగా విన్నవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదని మరో ట్వీట్‌లో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement