ఔట్‌సోర్సింగ్‌ సెక్రటరీలను విధుల్లోకి తీసుకోవాలి’

Krishnaiah Demands To Hired Outsourcing Junior Panchayat Secretaries - Sakshi

సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్‌): రాష్ట్రప్రభుత్వం తొలగించిన ఔట్‌సోర్సింగ్‌ జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ సెక్రటరీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ 2018లో పరీక్ష రాసి మెరిట్‌ లిస్టుతోపాటు రోస్టర్‌ పద్ధతి ద్వారా ఎంపికైన 370 మంది జూనియర్‌ పం చాయతీ కార్యదర్శులను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

నిరుద్యోగులంతా రోడ్డుపై తిరుగుతుంటే రిటైర్మెంట్‌ అయినవారికి ఎక్కువ జీతాలిచ్చి నియమించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.  పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు అనసూర్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ హిమామ్‌ వల్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు నీల వెంకటేశ్‌ పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top