తెలంగాణలో మరో నోటిఫికేషన్‌.. ఈసారి 1,271 పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల

Job Notification for replacement of posts in TSPDCL - Sakshi

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

70 ఏఈ, 201 సబ్‌ ఇంజనీర్, వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులు ఖాళీ

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 1,271 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఇందులో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌), 201 సబ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌), వెయ్యి జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీలవారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నియామక ప్రకటనను ఈ నెల 11న సంస్థ వెబ్‌సైట్‌ https://tssouthernpower.cgg.gov.in లేదా https://www.tssouthernpower.comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది.

త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్‌), తెలంగాణ జెన్‌కో సంస్థల నుంచి సైతం ఏఈతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్‌ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్‌కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉందన్నారు. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ దాదాపు 50 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top