బాసర ట్రిపుల్‌ ఐటీ రెండో జాబితా విడుదల 

IIIT Basara 2nd Selection List 2022 Released - Sakshi

7న కౌన్సెలింగ్‌ ప్రక్రియ షురూ   

బాసర (ముధోల్‌): బాసర ట్రిపుల్‌ ఐటీలో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో జాబితాను ఆదివారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. మొదటి విడతలో 1,404 మంది విద్యార్థుల జాబితాలో గైర్హాజరైన 125 మందికి సంబంధించిన సీట్ల జాబితాను కళాశాల వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు.

దీంతో పాటు రాష్ట్రేతర (గ్లోబల్‌ సీట్లు), దివ్యాంగులకు కేటాయించిన సీట్లతో పాటు స్పోర్ట్స్, కాప్‌ కేటగిరీకి చెందిన 95 సీట్లకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. 125 సీట్లకు సంబంధించి 7న, మిగిలిన కేటగిరీలకు సంబంధించిన 95 సీట్లకు ఈనెల 12 నుంచి 14 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మొదటి విడతలో 1,279 మంది విద్యార్థులు ప్రవేశం పొందార 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top