పార్టీని నడిపే సత్తా సంజయ్‌కు లేదు 

Hyderabad: Revanth Reddy Comments On Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీని నడిపించే సత్తా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మాట తాము చెపుతోంది కాదని, బీజేపీకి చెందిన జాతీయ నాయకుడు, పెద్దపెద్ద రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా ఉన్న ఓ వ్యక్తి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ చెప్పారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌జావేద్, సంపత్‌కుమార్, టీపీసీసీ నేతలు హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, అనిల్‌కుమార్‌ యాదవ్, మెట్టుసాయికుమార్‌లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. తాను మొదటి నుంచీ చెబుతున్నట్టుగానే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒకే తాను ముక్కలని, మోదీ–కేసీఆర్‌లు అవిభక్త కవలలని వ్యాఖ్యానించారు.

‘తెలంగాణలో బీజేపీది మూడో స్థానమేనని ఆ పార్టీ జాతీయ నాయకులే చెబుతున్నారు. గట్టిగా 40 మంది నాయకులు లేని తాము ఎలా గెలుస్తామని వారే అంటున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని చెపుతున్నారు’అని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ పోషించిన పాత్రను ఇక్కడ బీఆర్‌ఎస్, అక్కడ జేడీఎస్‌ పోషించిన పాత్రను ఇక్కడ బీజేపీ పోషించా లని చూస్తున్నాయని, కానీ, కర్ణాటకలో, ఇక్కడా అధికార పారీ్టలను ఓడించేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. కేసీఆర్‌ను ఓడించగలిగేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని, అయితే కొందరు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, ఆ తర్వాత వారికి అసలు సంగతి, బీజేపీ రంగు అర్థమయ్యాయని, ఇప్పటికైనా భ్రమ లు వీడి బీజేపీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు, పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం పునరాలోచన చేసుకోవాలని సూచించారు. ఎంఐఎం నేతల ప్రచారంతో మైనారీ్టలు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి గెలిపిస్తున్నారని, గెలిచిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఆ ఓట్లను మోదీకి తాకట్టు పెడుతోందని ధ్వజమెత్తారు.  

ఓఆర్‌ఆర్‌ వ్యవహారంలో కేంద్రం ఏం చేస్తోంది?  
రూ.లక్ష కోట్ల విలువైన ఔటర్‌రింగురోడ్డు టెండర్ల వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీకి పాల్పడిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇది Éìఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే వెయ్యి రెట్లు పెద్దదని అన్నారు. ఇంత యథేచ్ఛగా టెండర్లు కట్టబెట్టి దోచుకుంటుంటే కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. టెండర్‌ దక్కించుకున్న సంస్థ మొత్తం విలువలో 10 శాతాన్ని 30 రోజుల్లో, మిగిలిన మొత్తాన్ని 120 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని, అయితే అలాంటి నిబంధనలు లేవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెపుతున్నారని, నిబంధనలు మార్చి ఉంటే ఆ మార్చిన నిబంధనలేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఇప్పటి వరకు ఐఆర్‌బీ సంస్థ డబ్బులు చెల్లించిందో లేదో తెలియదు. చెల్లించకుంటే నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ సంస్థ టెండర్‌ను రద్దు చేయాలి’అని డిమాండ్‌ చేశారు. ఓఆర్‌ఆర్‌ టెండర్ల వ్యవహారాన్ని అంత సులువుగా వదిలిపెట్టబోమని, దీనిపై న్యాయం పోరాటం చేస్తామన్నారు.  

ఏ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించారు? 
ఏ హామీలు అమలు చేశారని.., ప్రజలకు ఏం నమ్మకం కలిగించారని మంత్రి హరీశ్‌రావు తమ తొమ్మిదేళ్ల పాలనను సమర్థించుకుంటారని రేవంత్‌ ప్రశ్నించారు. తాను స్వాతిముత్యం, మామ ఆణిముత్యం అని అనుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. అన్నీ మంచిగా చేస్తే భద్రత లేకుండా హరీశ్, కేటీఆర్‌లు ఓయూకు వెళ్లి నిరుద్యోగులతో చర్చించాలని, వారు క్షేమంగా తిరిగివస్తే.. చెప్పింది నిజమని ఒప్పుకుంటామని వ్యాఖ్యానించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top