After Wife Death Her Husband Commit Suicide In Siddipet, Details Inside - Sakshi
Sakshi News home page

Siddipet: భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య

May 16 2023 1:47 PM | Updated on May 16 2023 3:32 PM

husband commit suicide In Siddipet - Sakshi

వివాహమైన 4 నెలలకే ఆమె.. తన పుట్టింటి వద్ద  ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ప్రదేశంలో సరిగా పెళ్లి రోజుకు ముందు భర్త సైతం ప్రాణాలు తీసుకున్నాడు.

హుస్నాబాద్‌: జీవితంపై విర్తకి చెంది ఓ వ్యక్తి తన పెళ్లిరోజే...భార్య ఉరేసుకున్న చోటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ జిల్లా నేదునూర్‌ గ్రామానికి చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్‌(35)కు ఏడాది క్రితం హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన శారదతో వివాహమైంది.

పెళ్లయిన కొద్ది నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఆరునెలల క్రితం శారద తన ఇంటివద్ద ఉన్న చెట్టుకే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన నాటి నుంచి మనస్తాపానికి లోనైన శ్యాం ఆదివారం అర్ధరాత్రి హుస్నాబాద్‌కు వచ్చి భార్య చనిపోయిన చెట్టు వద్దే పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించేలోగానే మృత్యువాత పడ్డాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement