తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షం | Heavy Rains Bring Relief To AP And Telangana, Farmers Fear Crop Loss | Sakshi
Sakshi News home page

తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షం

May 3 2026 6:43 PM | Updated on May 3 2026 7:35 PM

Heavy rains in the state

ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాలను వరుణుడు కాస్త చల్లబరిచారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు ( ఆదివారం) భారీ వర్షాలు కురిశాయి.  ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయి. కోనసామ జిల్లాల్లోనూ భారీ జల్లులు పడ్డాయి. అకాల వర్షాలతో పంట నష్టం ఉండే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. నల్లగొండ, పెద్దవూర, తిప్పర్తిలో భారీ జల్లులు కురిశాయి. గుర్రంపూడి, సూర్యాపేట, కోదాడలో కుండపోతగా జల్లులు పడుతున్నాయి.  భారీగా కురిసిన వర్షం దాటికి హుూజుర్‌నగర్‌లో వృక్షాలు నేలకొరిగాయి. మిర్యాలగూడ, నకిరికేల్‌లో భారీ జల్లులు పడ్డాయి. సిద్ధిపేటలో భారీగా వర్షం కురవడంతో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. ఇన్నిరోజులు భానుడు భగభగలతో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వరుణుడు కరుణించడంతో కాస్త సేద తీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement