
సాక్షి,హైదరాబాద్: నగరంలో కుండపోత వాన కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఉప్పల్ టూ వరంగల్ రహదారి మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదివారం సాయంత్రం నుంచి మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్‌బీనగర్, ఉప్పల్, హయత్‌నగర్, టోలీచౌకీ, మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, అబ్ధుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్‌లలో భారీ వర్షపాతం నమోదైంది. కుషాయిగూడా, కాప్రా, ఏఎస్‌రావు నగర్, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయాణగూడ, అంబర్‌పేట్, నల్లకుంటలలో వర్ష పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.