
ఫొటోలు కామన్‌లో ‘లగ్జరీ’ఫోల్డర్‌లో ఉన్నాయి.
ఎంట్రన్స్, లాబీ నుంచే సకల హంగులు
నగరంలో పెరుగుతున్న ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: ఫైవ్‌స్టార్ హోటళ్లు అనగానే అతిథుల జిహ్వ చాప ల్యాన్ని తీర్చే విభిన్న వంటకాలు, విశాలమైన గదులు, స్విమ్మింగ్ పూల్స్, అత్యాధు నిక జిమ్‌లే కాకుండా మనసును ఆహ్లాదపరిచే సంగీతం, యోగా, ధ్యానం వంటి ఆరోగ్యకరమైన ఏర్పాట్లూ ఉంటాయి. మరి ఇలాంటి వసతులన్నీ సొంతింట్లోనూ ఉంటే? ఇంకా చెప్పాలంటే మీ ఇంటి అడ్రస్సే ల్యాండ్‌మార్క్‌లా నిలిచేలా కనిపిస్తే? ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే నగరాలకే ఇప్పటి వరకు పరిమితమైన ఈ తరహా థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజె క్ట్‌లు ఇప్పుడు హైదరాబాద్‌కూ వచ్చేశాయి. ప్రవాసులు, హై నెట్‌వర్త్‌గల వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐ)లు, ఎగువ ఆదాయ వర్గాలను రా.. రమ్మని పిలుస్తున్నాయి.
కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులతో..: గత దశాబ్దకాలంగా గృహ కొనుగోలుదారుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చాయి. విదేశాల్లోని గృహాలు, హోటళ్లు, రిసార్ట్‌ల్లోని వసతులను చూసి అలాంటి వసతులు తాముండే ఇళ్లలోనూ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో నిర్మాణ సంస్థలు థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుడుతున్నాయి. చాలా మంది కిడ్స్, ఫిట్‌నెస్, స్పోర్ట్స్, డిస్నీ థీమ్ వంటి ప్రాజెక్ట్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈజిప్టియన్, అరబిక్, స్పాని‹Ù, రోమన్ వంటి ఆర్కిటెక్చర్ డిజైన్లతో నిర్మాణాలను చేపడుతున్నారు. థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ప్రాజెక్ట్‌లున్న ప్రాంతం అభివృద్ధికి నిదర్శనంగా.. నగరానికే తలమానికంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహమక్కర్లేదు.
ప్యాలెస్ లాంటి ప్రాజెక్ట్‌లు..
పౌలోమీ, రాజపుష్ప, హానర్, మై హోమ్, శ్రీఆదిత్య, అపర్ణా వంటి పలు నిర్మాణ సంస్థలు నగరంలో పలు థీమ్ బేస్డ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌లు అభివృద్ధి చెందే ప్రాంతంలో, విశాలమైన విస్తీర్ణంలో, వినూత్నమైన ఆర్కిటెక్చర్ డిజైన్లు ఉంటాయి. వాటి ఎలివేషన్స్, వసతుల ఏర్పాట్ల కోసం విదేశీ ఆర్కిటెక్చర్లు, నిపుణుల అవసరం ఉంటుంది. ప్యాలెస్‌లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్ ఆర్కిటెక్చర్స్.. గృహ నిర్మాణాల్లోనూ మొదలయ్యాయి. మానసిక చైతన్యం, ప్రేరణను కలిగించడమే సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రత్యేకత.
ఇందుకోసం ఆయా ప్రాజెక్టుల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్రపటాలు, జీవిత చరిత్రలు, బొమ్మలు, గుర్తులను పెడతారు. అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటే మెదడు సానుకూలంగా ఆలోచిస్తుంది. దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. సబ్లిమినల్ ఆర్కిటెక్చర్‌లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్ కామన్ ఏరియా, ఓపెన్ స్పేస్, క్లబ్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చ
ప్రాజెక్ట్ మధ్యలో క్రీక్..
సాధారణ నిర్మాణాలతో పోలిస్తే థీమ్, సబ్లిమినల్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టుబడి కూడా కొంత ఎక్కువే అవసరం. అందుకే ఇళ్ల ధరలు కూడా కాస్త అధికంగా ఉంటాయి. కానీ ఆయా ప్రాజెక్టులు అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి. కొత్త తరహా ప్రాజెక్టులు, వసతులున్న ప్రాజెక్టులను చూసేందుకు కస్టమర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వాటిల్లో క్లబ్ హౌస్‌తోపాటు జిమ్, ఇండోర్ గేమ్స్, బాంక్విట్ హాల్, కాఫీ షాప్, లైబ్రరీ, ప్లే స్కూల్, సూపర్ మార్కెట్, సెలూన్, గెస్ట్ రూమ్స్, పార్టీ ఏరియా వంటి వసతి ఏర్పాట్లున్నాయి. ప్రాజెక్ట్ మధ్యలో నుంచి చిన్నపాటి సరస్సు పారుతున్నట్లు వాటర్ క్రీక్ ఏర్పాట్లు సైతం ఉంటాయి. ఈ క్రీక్ నిత్యం నీటి ప్రవాహంతో గలగలలాడుతుంటే మనసు ఆహ్లాదకరంగా మారుతుంది.