12,700 పంచాయతీలు, 110 మున్సిపాలిటీల్లో నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు విజయవంతంగా నిర్వహించారు. 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీల్లో ఈ సభలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామసభలో సీఎస్ కె.రామకృష్ణారావు పాల్గొన్నారు.
పలుచోట్ల జరిగిన గ్రామసభల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్‌లో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ పాల్గొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టరు ఈ సభల్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకా లపై ప్రజలకు అవగాహన కలి్పంచారు.


