Former MLA Daughter Thati Mahalakshmi Commits Suicide in Sarapaka, Details Inside - Sakshi
Sakshi News home page

Thati Mahalakshmi Suicide: మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య

Apr 14 2022 9:32 AM | Updated on Apr 14 2022 3:10 PM

Former MLA Daughter Thati Mahalakshmi Commits Suicide in Sarapaka - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నాయకులు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి బుధవారం ఇంట్లో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారు జామున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎంతకు గది తలుపులు తెరవకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా మహాలక్ష్మి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు.

అనంతరం పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తండ్రి తాటి వెంకటేశ్వర్లు హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి కన్న కూతురు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ ప్రిపేర్ అవుతోంది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.

ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001

మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: (రైళ్లో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement