యాక్సిస్ బ్యాంక్‌ ఏటీఎంలో చెలరేగిన మంటలు | Fire In Axis Bank ATM Center In Mahabubabad | Sakshi
Sakshi News home page

యాక్సిక్‌ ఏటీఎంలో చోరీకి యత్నం.. విఫలం కావడంతో..

Oct 13 2021 11:34 AM | Updated on Oct 13 2021 11:44 AM

Fire In Axis Bank ATM Center In Mahabubabad - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: మహబూబాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలోని యాక్సిస్ బ్యాంక్‌ ఏటీఎంలో మంగళవారం అర్థరాత్రి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ఇంటి యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఏటీఎంలోని పర్నీచర్‌ దగ్దమైంది. మంటలు చెలరేగడంతో ఏటిఎం నుంచి బ్యాంకు ముంబాయి కంట్రోల్ రూమ్‌కు మెసెజ్‌ వెళ్లింది.
చదవండి: Hyderabad: మూడేళ్ల క్రితం లైంగికదాడి, కామాంధునికి జీవిత ఖైదు

అయితే ఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అర్థరాత్రి దాటాక ఏటీఎం వద్దకు ఇద్దరు వచ్చినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. చోరికి యత్నించిన వారే నిప్పు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతోనే నిప్పు పెట్టినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement