
ఇటీవల బాగా పెరిగిన ఫేక్ న్యూస్
ఏఐ టూల్స్‌తో డీప్ ఫేక్ వీడియోలు సృష్టి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నకిలీ వార్తలు
ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదుల వెల్లువ
ప్రస్తుత ఇంటర్నెట్ జమానాలో నిమిషానికో ఫేక్ వీడియో పుట్టుకొస్తోంది. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతి మాధ్యమాన్ని వాడి కొందరు తప్పుడు వార్తలు, నకిలీ వీడియోలను వైరల్ చేస్తున్నారు. దేశంలో 77.4 శాతం ఫేక్ న్యూస్ వ్యాప్తి సోషల్ మీడియా ద్వారానే జరుగుతోంది. డీప్ ఫేక్‌ల కారణంగా 55 శాతం మంది ప్రజలు సోషల్ మీడియా కంటెంట్‌పై నమ్మకం కోల్పోతున్నారని 2024లో ఒక సర్వే తెలిపింది. - సాక్షి, హైదరాబాద్
ఫేక్ న్యూస్ వ్యాప్తి ఇలా..
» దేశంలో సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందే ఫేక్ న్యూస్‌లలో రాజకీయ సంబంధమైనవి 46 శాతం, సాధారణ అంశాలపై 33.6 శాతం, మతపరమైనవి 16.8 శాతం ఉంటున్నాయి.
» 2022–2024 మధ్య నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)లో ఫేక్ న్యూస్‌పై 12 వేల ఫిర్యాదులు నమోదయ్యాయి.
» పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా దేశవ్యాప్తంగా 2019 నుంచి 2025 వరకు సుమారు 50 వేల నకిలీ వార్తలను ధ్రువీకరించింది.
» తెలంగాణ ప్రభుత్వం 2020లో స్థాపించిన ఫ్యాక్ట్ చెక్ పోర్టల్ 2020–2025 మధ్య రాష్ట్రంలో సుమారు 8,000 నకిలీ వార్తలను ధ్రువీకరించింది. వీటిలో 50% రాజకీయ అంశాలు, 30% సా మాజిక సమస్యలు, 15% ఆరోగ్య సంబంధిత వార్తలున్నాయి.
» తెలంగాణలో 2022–2024 మధ్య ఫేక్ న్యూస్‌పై 1,200 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి, వీటిలో 70% సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందినవి.
» రాష్ట్రంలో ఫేక్ న్యూస్ వ్యాప్తి 65% వాట్సాప్ ద్వారా జరుగుతోంది.
డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తి ఇలా..
» 2023లో దేశవ్యాప్తంగా సుమారు 50,000 డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు సృష్టించబడినట్లు అంచనా. ఈ సంఖ్య 2024లో 20% పెరిగింది.
» 2023–2025 మధ్య డీప్‌ఫేక్ వీడియోసంబంధిత ఫిర్యాదులు సుమారు 3,500 ఎన్‌సీఆర్‌పీలో నమోదయ్యాయి.
» దేశంలో డీప్‌ఫేక్ కంటెంట్‌లో 60% వాట్సాప్ ద్వారా, 25% ట్విట్టర్ ద్వారా వ్యాప్తి చెందుతోంది.
» రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగంలో 2023–25 మధ్య డీప్‌ఫేక్ సంబంధిత ఫిర్యాదులు 300 నమోదయ్యాయి. రాష్ట్రంలో డీప్‌ఫేక్ కంటెంట్‌లో 50% వాట్సాప్, 30% ట్విట్టర్, 15% టెలిగ్రామ్ ద్వారా వ్యాప్తి చెందుతోంది.
చెక్ పెట్టండిలా..
ఎస్‌సీఆర్‌పీ పోర్టల్: డీప్ ఫేక్ వీడియోలపై ఫిర్యాదు చేయ డానికి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cyb ercrime.gov.in) (www. cybercrime.gov. in)ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది.
ఫ్యాక్ట్ చెక్: సోషల్ మీడియాలో వచ్చే సమాచారం నకిలీదా, నిజమైనదా? అని నిర్ధారించుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్, తెలంగాణ ఫ్యా�క్ట్ చెక్ పోర్టల్ (factcheck.telangana.gov.in) అందుబాటులో ఉన్నాయి.
ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు
ఏ విషయంలోనైనా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు. అన్ని అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గమనిస్తున్నారు. తప్పుడు వార్తలపై 87126 72222 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు పంపండి. – ఎక్స్‌లో టీజీసీఎస్‌బీ
కేస్ 01
విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఇటీవల చేసినప్రసంగంలో దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పినట్టుఒక వీడియో ఈ నెల 10న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడిరూపొందించిన ఫేక్ వీడియోగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది.
కేస్ 02
శంషాబాద్ విమానాశ్రయంలో ఒక కరుడుగట్టిన ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుంటున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇటీవల జరిగిన మాక్ డ్రిల్‌లోదని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా బయటపెట్టింది.
కేస్ 03
భారతసైన్యానికి విరాళాలుసేకరించేందుకు కేంద్రం బ్యాంకు ఖాతా తెరిచిందని, ప్రజలు విరాళాలు ఇవ్వాలని వాట్సాప్‌లో ఒక మెసేజ్ వైరల్‌అవుతోంది. ఇది నకిలీ సందేశమని,అప్రమత్తంగా ఉండాలని టీజీ సీఎస్‌బీ ప్రకటించింది.