
రాష్ట్రానికి రూ.5వేల కోట్ల ఆదాయ నష్టం వస్తోంది
అయినా పేద, మధ్యతరగతి, రైతాంగ వర్గాల కోసం భరిస్తున్నాం
తగ్గుతున్న వస్తువుల ధరలను దుకాణాల ముందు ప్రదర్శించాలి
ట్రేడర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ రేట్ల తగ్గింపులో ప్రముఖ పాత్ర తనదేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ‘జీఎస్టీ రేట్ల సవరణ కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. జీఎస్టీ కౌన్సిల్ సభ్యునిగా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవడంలో నేను ప్రముఖ పాత్ర పోషిస్తున్నా’అని ఆయన వెల్లడించారు. జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, అయినా పేద, మధ్య తరగతి ప్రజలు, రైతుల శ్రేయస్సుకు ఆ నష్టాన్ని భరిస్తున్నామని స్పష్టం చేశారు.
జీఎస్టీ రేట్ల సవరణ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వ్యాపార వర్గాలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల మేలు కోసం జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేబినెట్ మొత్తం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. సవరించిన రేట్లతో పెద్ద సంఖ్యలో వస్తువుల ధరలు తగ్గుతున్నాయని, ఈ ఫలాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతోపాటు వ్యాపారులందరిపై ఉందని చెప్పారు. రేట్ల సవరణ ద్వారా తగ్గిన వస్తువుల వివరాలు ప్రజలకు వ్యాపారులు తెలియజేయాలని,
15 రోజుల్లో ఆదాయ పెంపు మార్గాలపై నివేదిక ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచడంలో భాగంగా అన్ని శాఖలను సమన్వయం చేసే బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీరియస్‌గా తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆదాయ వనరుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమా వేశమైంది. భట్టి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తోపాటు ఆర్థిక, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, ఇతర ఆదాయార్జిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆదాయ పెంపుదలకు గల మార్గాలను అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి సర్కిల్‌వారీగా పన్నుల శాఖ ఆదాయాన్ని సమీక్షించాలని, రవాణా శాఖలో ఆదాయ లక్ష్యాలు చేరుకునేందుకు అవసరమైన ప్రత్యేక పాలసీని రూపొందించాలని భట్టి చెప్పారు.