అమీన్‌పూర్‌ కేసు స్వాతి లక్రాకు అప్పగింత | Sakshi
Sakshi News home page

అమీన్‌పూర్‌ కేసు స్వాతి లక్రాకు అప్పగింత

Published Fri, Aug 14 2020 5:00 PM

DGP Directed Swati Lakra To Oversee The Ameenpur Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమీన్‌పూర్‌ కేసును ఉమెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ స్వాతి లక్రాకు అప్పగించారు. కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కేసు,నమోదు, అరెస్ట్‌ వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు.డీజీపీ ఆదేశాల మేరకు ఉమెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి ప్రత్యేక అధికారిని నియమించారు. నిందితుల అరెస్ట్‌, ట్రయల్స్‌, కేసు విచారణపై స్వాతి లక్రా దృష్టి పెట్టనున్నారు. (చిన్నారులను అందంగా అలంకరించి..)

అమీన్‌పూర్‌లోని మియాపూర్‌ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్‌ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్‌ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి  వెలుగులోకి వస్తున్నాయి. (అమీన్‌పూర్‌లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్‌’)

Advertisement
 
Advertisement