‘సరస్వతీ’ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Damodara Raja Narasimha Letter Wrote To Telangana CS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సరస్వతి పంప్‌హౌస్‌లో నాణ్యత లేని పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు కాంగ్రెస్ సీనియర్‌ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. అన్నారం సరస్వతి పంప్‌ హౌస్‌ నిర్మాణ వ్యయం ఎంత? ఎన్ని మోటార్లు అమర్చారు? అని లేఖలో ప్రశ్నించారు. పైపుల డ్యామేజీకి కారణాలేంటి? అని అడిగారు. నిబంధనలు పాటించని ఏజెన్సీపై.. పర్యవేక్షించాల్సిన ఇంజనీర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టారు? అని నిలదీశారు. అన్నారం సరస్వతి పంప్‌ హౌస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top