Corona Virus: తప్పని ‘మహ’ ముప్పు

Corona Virus Spreadding From Maharashtra To Telangana Border Villeges - Sakshi

పక్క రాష్ట్రం నుంచి నిత్యం రాకపోకలు

నందిపేటలో ఇటీవల 43 కేసులు నమోదు

గ్రామంలో టెస్ట్‌లు, నష్ట నివారణ చర్యలు

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్: కరోనా కేసులు తగ్గుతున్నతరుణంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వారి నుంచి పాజిటివ్​ ముప్పు పొంచి ఉంది. సెకెండ్‌వేవ్​లో రెండు నెలల క్రితం విపరీతంగా రాకపోకలు ఉండడంతో కేసుల పెరుగుదల ఎక్కువైంది. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న వారితో ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటన నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. చిన్నపాటి విందుకు వచ్చిన మహారాష్ట్ర వాసుల కారణంగా గ్రామంలో కరోనా కేసులు పెరగగా, అధికారులు నివారణ చర్యలు చేపట్టి వైరస్‌ను నియంత్రణలోకి తీసుకొచ్చారు.

కందూరు.. కొంపముంచింది..
నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో ఓ కుటుంబం సంప్రదాయం ప్రకారం గతనెల 30వతేదీన కందూరు చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని తమ బంధువులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించగా అక్కడి నుంచి ఆరుగురు బంధువులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయిన రెండు రోజులకే కందురు చేసిన కుటుంబంలో మొదట ఐదుగురికి కరోనా లక్షణాలు బయటపడడంతో టెస్టులు చేయించుకున్నారు. పాజిటివ్​ వచ్చింది.

గ్రామంలోని కొందరు ఈ కార్యక్రమానికి వెళ్లగా వారికి కూడా కరోనా పాజిటివ్​ వచ్చింది. కందూరు చేసిన ఇంటి చుట్టు పక్కల ఉన్న వారికి, గ్రామంలోని కొందరికీ వేగంగా వైరస్‌ విస్తరించింది. గ్రామంలో ఒక్కొక్కరికి లక్షణాలు వెలుగులోకి రావడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యసిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

దీంతో అదనపు వైద్యాధికారి రమేష్​ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు గుర్తించి గ్రామంలోనే కరోనా టెస్టులు చేపట్టారు. ఈనెల 2న 5కేసులు, 3న 15కేసులు, 4న 12కేసులు, 5–11 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం 43 కేసులు వెలుగులోకి వచ్చాయి.

స్పందించిన వైద్యాధికారులు..
త్వరితగతిన స్పందించిన వైద్యాధికారులు పాజిటివ్​ వచ్చిన వ్యక్తులను హోంఐసోలేషన్​ లో ఉంచారు.ఎప్పటికప్పుడు గమనిస్తూ మందులను అందించారు. దీంతో ఒక్కొక్కరికి పాజిటివ్​ తగ్గుతూ వస్తోంది. కాగా కందూరుకి వచ్చిన మహారాష్ట్ర వాసులు వెంటనే వెళ్లిపోయారు. వైద్యాధికారులు, ఎంపీడీవో, ఏసీపీ, ఇతర అధికారులు ఎప్పటికప్పుడుగ్రామాన్ని సందర్శిస్తూ వివరాలు తెలుసుకున్నారు.

జిల్లా వైద్యాధికారి డా.బాలనరేంద్ర గ్రామాన్ని సందర్శించి కోవిడ్‌ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించి గ్రామస్తులతో చర్చించారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కాగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి పాజిటివ్​ రావడంతో వైద్యాధికారులు వైరస్‌సరళిని పరిశీలిస్తున్నారు. సెకండ్‌వేవ్​ లక్షణాలుఉన్నాయా లేక థర్డ్‌ వేవ్​ లక్షణాలు ఏమైనాఉన్నాయా అని పరిశీలన చేపట్టగా సెకండ్‌ వేవ్​ లక్షణాలుఉన్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.

పక్క రాష్ట్రవాసులతోనే సమస్య..
జిల్లాలో ఒకవైపు పాజిటివ్​ కేసులు గణనీయంగా తగ్గిపోతున్న తరుణంలో లాక్‌డౌన్​  కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర వాసులు ఇక్కడికి రావడం పాజిటివ్​ కేసులు వెలుగులోకి రావడం వైద్యశాఖను ఆందోళనకు గురిచేసింది.ప్రస్తుతం గ్రామంలో కొత్తగా పాజిటివ్​ కేసులు రావడం లేదు. తాజాగా ఆదివారం 39మందికి టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్​ వచ్చింది.

గ్రామంలో అందరికీ టెస్టులు చేసేందుకు వైద్యాధికారులు ప్రతిరోజు అక్కడ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డా.బాలనరేంద్రను వివరణ కోరగామహారాష్ట్ర వాసులు ఇక్కడికి రావడంతో పాజిటివ్​ కేసులు పెరిగాయని, గ్రామంలో కొందరికి వైరస్‌ సోకిందన్నారు. హుటాహుటిన స్పందించిన యంత్రాంగం వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురావడం జరిగిందన్నారు.

చదవండి​:  Lockdown​: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-06-2021
Jun 07, 2021, 11:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్‌ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో...
07-06-2021
Jun 07, 2021, 10:04 IST
న్యూఢిల్లీ:  దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. సుమారు రెండు నెలల తరువాత కోవిడ్‌ కేసులు లక్షకు దిగొచ్చాయి....
07-06-2021
Jun 07, 2021, 08:36 IST
చండీఘడ్‌:  దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్​ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం...
07-06-2021
Jun 07, 2021, 05:55 IST
కంచికచర్ల (నందిగామ): ఓ విశ్రాంత ఉద్యోగి కరోనా వచ్చిందని మనస్తాపం చెంది గొంతు కోసుకున్న ఘటన ఆదివారం కంచికచర్లలో జరిగింది....
07-06-2021
Jun 07, 2021, 05:37 IST
తిరుపతి తుడా/పుత్తూరు రూరల్‌:  కరోనా సోకిన పదేళ్లలోపు చిన్నారులు తొమ్మిది మంది తిరుపతి రుయా పరిధిలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో అడ్మిట్‌...
07-06-2021
Jun 07, 2021, 05:17 IST
ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆదివారం కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును పంపిణీ చేశారు....
07-06-2021
Jun 07, 2021, 05:13 IST
చంద్రగిరి: కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపటా్ననికి చెందిన ఆనందయ్య మందును చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తయారు చేస్తున్నారు. ఈ సంప్రదాయ...
07-06-2021
Jun 07, 2021, 04:59 IST
మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్స్‌ (మిస్‌–సీ).. ఆందోళన వద్దంటున్న నిపుణులు
07-06-2021
Jun 07, 2021, 02:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: నులిపురుగులను నియంత్రించే నిక్లోసమైడ్‌ ఔషధాన్ని కరోనా చికిత్స నిమిత్తం లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో...
07-06-2021
Jun 07, 2021, 02:28 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్‌ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2...
07-06-2021
Jun 07, 2021, 01:33 IST
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుదల ఆశావహ పరిస్థితులు కల్పిస్తోంది. కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఈ వాతావరణం నెలకొంటోంది....
06-06-2021
Jun 06, 2021, 21:03 IST
కృష్ణా: జిల్లాలో 33 కోవిడ్ ఆస్పత్రుల అనుమతి రద్దు చేస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌.. జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి శివశంకర్‌ ఆదివారం తెలిపారు. ప్రభుత్వ...
06-06-2021
Jun 06, 2021, 20:08 IST
హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. తగ 24 గంటల్లో 97,751 మందికి కరోనా పరీక్షలు చేయగా.....
06-06-2021
Jun 06, 2021, 18:35 IST
సాక్షి,చిత్తూరు: తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో...
06-06-2021
Jun 06, 2021, 17:19 IST
గురుగ్రామ్‌: డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన వివాదాస్పద గురువు , డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ కరోనా...
06-06-2021
Jun 06, 2021, 17:02 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో 381 కొత్త కరోనా...
06-06-2021
Jun 06, 2021, 16:58 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8,976 పాజిటివ్‌గా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 90...
06-06-2021
Jun 06, 2021, 16:44 IST
ఇంఫాల్‌: కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న హెల్త్‌ వర్కర్లపై భౌతిక దాడులు జరుగుతున్నాయి. మొన్న అస్సాంలో హెల్త్‌ వర్కర్లపై...
06-06-2021
Jun 06, 2021, 15:01 IST
లక్నో: కరోనా ఉధృతి కారణంగా అనేక రాష్ట్రాలలో లాక్​డౌన్​ విధించి, కఠిన నిబంధలను అమలు పరుస్తున్న విషయం తెలిసిందే. ఈ...
06-06-2021
Jun 06, 2021, 09:08 IST
ఆడవారు ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా ఆహార నియమాలు పాటించడం మంచిది. పొద్దున నిద్రలేవగానే గ్లాసుడు గోరువెచ్చని మంచినీళ్లు, అందులో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top