తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కరోనా ఎఫెక్ట్‌ | Corona Effect On Telangana Assembly Sessions In Hyderabad | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కరోనా ఎఫెక్ట్‌

Mar 22 2021 12:05 PM | Updated on Mar 22 2021 3:53 PM

Corona Effect On Telangana Assembly Sessions In Hyderabad - Sakshi

ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలపైనే కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే ఎమ్మెల్సీ పురాణం సతీష్ కరోనా వైరస్‌ బారిన పడగా.. తాజాగా ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్ రెడ్డికి కరోన పాజిటివ్‌గా నిర్థారణ అయింది.‌ ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కుదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నిర్వహించే బీఏసీ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా మంగళవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ ప్రకారం ఈనెల 26వరకు అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండగా నేడు తీసుకునే బీఏసీ నిర్ణయం కీలకంగా మారనుంది.

మరో వైపు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సెషన్‌ కొనసాగుతోంది. కాసేపట్లో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కరించనున్నారు. రిటైర్‌మెంట్ వయసు పెంపు, సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్‌పై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ప్యాకేజీ రూపంలో తీపి కబురు అందిచనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఇప్పటికే రూ.8వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

చదవండి:  కరోనా కేసులతో తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement