ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం ఆరా | CM Revanth Reddy Reviews Decline in MMTS Passenger Numbers | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం ఆరా

Mar 26 2026 7:15 PM | Updated on Mar 26 2026 7:39 PM

CM Revanth Reddy Reviews Decline in MMTS Passenger Numbers

హైద‌రాబాద్‌: ఎంఎంటీఎస్‌లో ప్రయాణికుల తగ్గుముఖంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఈ మేరకు గురువారం(మార్చి 26వ తేదీ) ఎంఎంటీఎస్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా అధికారులకు అనేక సూచనలు చేశారు. 

హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాలని సూచించిన సీఎం.. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మ‌య పాల‌న పాటిస్తూ స‌ర్వీసులు న‌డ‌పాల‌ని ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉన్నందున అక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాలన్నారు. 

ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌న్నారు. మెరుగైన వ‌స‌తులు ఉన్న‌ప్పుడే ప్ర‌యాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని ఈ మేరకు సీఎం పేర్కొన్నారు. స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని.. లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్ర‌యాణికుల సంఖ్య పెంపు.. వ‌స‌తులు మెరుగుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌న్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement