బూస్టర్‌ డోసు అంటే ఏమిటి?.. పాటించాల్సిన జాగ్రత్తలేంటి?

CM KCR Review Meeting Over Covid And Booster Dose - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు వ్యాప్తి నేపథ్యంలో..  సీఎం కేసీఆర్‌ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.  15–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనందున, తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించాలి. సోమవారం నుంచి ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్, హెల్త్‌ కేర్‌ వర్కర్లతో పాటు 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు (దీర్ఘకాలిక వ్యాధులున్నవారు) బూస్టర్‌ డోసును ప్రారంభించనున్నాం.

అర్హులంతా తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. సంక్రాంతి రోజు గుంపులుగా కాకుండా ఎవరి ఇళ్లల్లో వారుండి పండుగ జరుపుకోవాలి.

బూస్టర్‌ డోసు అంటే..
నిర్దిష్ట డోసుల మేరకు టీకా తీసుకున్న తర్వాత దాన్నుంచి లభించే రక్షణ తగ్గుతోందని భావించినప్పుడు అదనంగా ఇచ్చే దానినే బూస్టర్‌ డోసు అంటారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు బూస్టర్‌ డోసు ఇస్తున్నాయి. మన దేశంలో ప్రికాషనరీ (ముందుజాగ్రత్త) డోసుగా వ్యవహరిస్తున్నారు.

ఎవరికి వేస్తారు..
 ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ టీకా వేస్తారు. రెండోడోసు తీసుకున్న 9 నెలలకు ఈ డోసు ఇస్తారు. 

ఏ టీకా తీసుకోవాలి..
► గతంలో ఏ కంపెనీకి చెందిన టీకా రెండు డోసులు తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే టీకా వేస్తారు. మరొకటి తీసుకోకూడదు. ప్రికాషనరీ డోసుకు అర్హులైన లబ్ధిదారుల జాబితా కోవిన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.

పాటించాల్సిన జాగ్రత్తలేంటి..
 టీకా తీసుకున్న తర్వాత దాదాపు 30 నిమిషాల పాటు సంబంధిత వ్యాక్సినేషన్‌ కేంద్రంలోనే ఉండాలి. ఆ సమయంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా వస్తున్నాయా? లేదా? అని పరిశీలిస్తారు. డోసు వేసుకున్న రోజు మద్యం సేవించకూడదు. మాంసాహారం తినకూడదు. 

చదవండి: క్షణం ఆలస్యమై ఉంటే అంతే  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top