యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌

CM KCR Inspection Of Yadadri Thermal Power Plant Works - Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం ప్లాంటులోని పనులను దగ్గరుండి పరిశీలించారు. ప్లాంట్‌ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల‌ పురోగతిపై సీఎం కేసీఆర్‌కు మ్యాప్ ద్వారా వివరించారు. ఈ మేరకు అధికారులకు పలు కీలక‌ సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎమ్మెల్యేలు ఉన్నారు.

అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు. కాగా ఇప్పటి వరకు 62 శాతం వరకు పనులు పూర్తి కాగా.. వచ్చే ఏడాది ప్లాంట్‌ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఒకే స్థలంలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థం కలదు. రూ. 2,992 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top