సాక్షి,తెలంగాణ భవన్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై షోకాజు నోటీసులు పంపింది. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. గడువు సమయంలో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని షోకాజు నోటీసుల్లో పేర్కొంది.
మరోవైపు మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. డీసీపీ యోగేష్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ టెస్ట్‌లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ శర్మలకు పాజిటివ్ వచ్చింది.
నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్‌ను తానే తెచ్చానని కౌశిక్ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్‌ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ అంగీకరించాడు.


