తెలుగు విద్యార్థులను కాపాడండి

BJP Seeks Evacuation Of Students From Ukraine: Bandi Sanjay - Sakshi

విదేశాంగ శాఖ కార్యాలయానికి బండి సంజయ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడి చిక్కుకుపోయిన భారతీయులను, ముఖ్యంగా తెలుగు విద్యార్థులను రక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విదేశాంగ శాఖను కోరారు. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో స్వదేశానికి బయల్దేరిన సుమారు 20 మంది భారతీయ విద్యార్థులు.. అక్కడి కీవ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. వీరిలో ఒకరి సోదరుడు  బండి సంజయ్‌ను కలిసి ఈ విషయాన్ని వివరించారు.

దీనిపై స్పందించిన బండి సంజయ్‌.. వెంటనే ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి ఫోన్‌ చేసి, మాట్లాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుక్కుపోయిన వారందరినీ స్వదేశానికి రప్పించాలని కోరుతూ లేఖ వారికి పంపారు. ఈ లేఖపై స్పందించిన కార్యాలయ అధికారులు.. ఉక్రెయిన్‌తో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని, భారతీయులంద రినీ క్షేమంగా తరలించేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు.

ఈ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొంటూ బండి సంజయ్‌ గురువారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అక్కడ చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల వివరాల సేకరణకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశాం. 8333871818 నంబర్‌కు ఫోన్‌ చేసి.. వివరాలు తెలిపితే విదేశాంగ అధికారులతో మాట్లాడుతాం..’’ అని తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top