పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు | Sakshi
Sakshi News home page

పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

Published Tue, Jan 2 2024 4:50 AM

Best Service Medals for Telangana Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూత­న సంవత్సరం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాలతో పాటు అగ్నిమాపక శాఖ, అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లో మొత్తం 636 మంది సిబ్బందికి ఈ పతకాల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న 89 మందికి ఉత్తమ సేవా, 42 మందికి కఠిన సేవా, 435 మందికి సేవా పతకాలు లభించాయి.

9 మందికి మహోన్నత సేవా పతకాలు లభించాయి. ఏసీబీలో ఐదుగురికి ఉత్తమ సేవా, ముగ్గురికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో ముగ్గురికి ఉత్తమ సేవా, ఏడుగురికి సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక శాఖలో ఆరుగురికి శౌర్య పతకాలు, ముగ్గురు ఉత్తమ సేవా, 13 మంది సేవా పతకాలు పొందారు. ఎస్పీఎఫ్‌లో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా, 15 మందికి సేవా పతకాలు, ఒక గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఉపేందర్‌కు శౌర్య పతకం లభించింది.   

Advertisement
 
Advertisement