నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ | Arogyasri services to be closed from sep 17 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

Sep 17 2025 6:19 AM | Updated on Sep 17 2025 6:19 AM

Arogyasri services to be closed from sep 17

మరో గత్యంతరం లేకే నిర్ణయం

నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, వరంగల్‌: రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌ విజ్ఞప్తి చేసినా.. సేవల నిలిపివేతకే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో గత ఆగస్టు నుంచి ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూసినా ప్రయోజనం లేకపోవడంతో సేవలు నిలిపి వేయడం మినహా మరో గత్యంతరం లేకుండా పోయిందని అసోసియేషన్‌ అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్‌ ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్థిక సమస్యలతో పాటు ఆసుపత్రుల్లో సేవలకు సంబంధించి కూడా చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో 470 వరకు ఆసుపత్రులు ఉండగా వీటికి సంబంధించి రూ.1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు అసోసియేషన్‌ చెబుతోంది.

తెల్లరేషన్‌కార్డు ఇవ్వగానే ఆస్పత్రుల్లో చేర్చుకునే ఆస్పత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో పేదలు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది.బిల్లుల బకాయిలను రాబట్టుకోవడం కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నిర్వాహకులు సేవలను బంద్‌ చేయడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. 2024 డిసెంబర్‌ నాటికి బకాయిలు రూ.1,000 కోట్లు దాటాయని పేర్కొంటూ జనవరి 10 నుంచి ఐదారు రోజులపాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement