విషాదం: బిడ్డను గమనించని తండ్రి.. వాహనాన్ని ముందుకు నడపడంతో | 5 Years Kid Passed Away Due To Goods‌ Vehicle Down In Warangal | Sakshi
Sakshi News home page

విషాదం: బిడ్డను గమనించని తండ్రి.. వాహనాన్ని ముందుకు నడపడంతో

Feb 9 2022 2:32 AM | Updated on Feb 9 2022 12:41 PM

5 Years Kid Passed Away Due To Goods‌ Vehicle Down In Warangal - Sakshi

చందన(ఫైల్‌)  

గీసుకొండ: అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు.. పొరపాటున తండ్రి నడిపించే గూడ్స్‌ వాహనం కిందపడి తనువు చాలించింది. ఈ ఘటన గ్రేటర్‌ వరంగల్‌ 16వ డివిజన్‌ కీర్తినగర్‌ కాలనీలో మంగళవారం జరిగింది. బొలెరో గూడ్స్‌ వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్న వల్లెపు రమేశ్‌కు కూతురు చందన (5), కుమారుడు ఉన్నారు.

రమేశ్‌ ఉదయం ఇంటి నుంచి గూడ్స్‌ వాహనాన్ని వరంగల్‌ కూరగాయల మార్కెట్‌కు తీసుకుని వెళ్లడానికి సిద్ధమవుతుండగా.. దివ్యాంగురాలైన చందన పాకుకుంటూ ఆ వాహనం వెనుక టైరు వద్దకు చేరింది. కూతురుని గమనించని తండ్రి వాహనాన్ని ముందుకు నడపడంతో టైరు కిందపడి చందన అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దేవేందర్‌ తెలిపారు.
(చదవండి: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement