తహసీల్దార్‌ కార్యాలయంలో కూలిన ప్రహరీగోడ | - | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ కార్యాలయంలో కూలిన ప్రహరీగోడ

May 31 2026 1:54 AM | Updated on May 31 2026 1:54 AM

పళ్లిపట్టు: పళ్లిపట్టు తహసీల్దారు కార్యాలయ ఆవరణలో ప్రహరిగోడ కూలింది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన తహసీల్దారు కార్యాలయ భవనం దుస్థితికి చేరుకుంది. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెల్టర్‌, మరుగుదొడ్లు పట్టించుకోక పోవడంతో చెట్లు, పెరిగి నిరుపయోగంగా మారింది. అలాగే కార్యాలయం చుట్టూ చెత్తకుప్పలు నిండిపోవడంతో అపరిశుభ్రత చోటుచేసుకుంటోంది. ఈక్రమంలో శనివారం కార్యాలయం ముందుభాగంలోని ప్రహరీగోడలో కొంత భాగం కూలి పడింది.

దీంతో కార్యాలయంలోకి పాములు సహా విష పురుగులు చోరబడే ప్రమాదమున్నందున ప్రహరిగోడ నిర్మించి తహసీల్దారు కార్యాలయంలో పరిశుభ్రత పెంపొందించి మరుగుదొడ్లు, షెల్టర్‌ ప్రజలు వినియోగించుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కూలిన ప్రహరీగోడ, చెట్లు పెరిగి నిరుపయోగంగా మరుగుదొడ్లు, ప్రజలు వేచివుండే షెల్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement