సేలం జిల్లా అన్నాడీఎంకే కోట
సాక్షి, చైన్నె: సేలం జిల్లా ఎప్పుడూ అన్నాడీఎంకే పార్టీకి తిరుగులేని ఉక్కు కోట అని మరోసారి ని రూపించిన ఇక్కడి ప్రజలకు హృదయపూర్వక పా దాభివందన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళనిస్వామి వ్యాఖ్యలు చేవారు. తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడి పరిధిలోని వివిధ ప్రాంతా ల్లో శనివారం పర్యటించిన ఆయనకు, పార్టీ శ్రేణు లు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతులు ఇచ్చి, పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఎడప్పాడి పళనిస్వామి మాట్లాడారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను
ఎన్ని రాజకీయ కుతంత్రాలు జరిగినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సేలం జిల్లా ప్రజలు, ము ఖ్యంగా ఎడపాడి నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పు డూ తనాపై, అన్నాడీఎంకే పార్టీపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచుతూ వస్తున్నారన్నారు. అన్నాడీఎంకేను కాపాడుకుంటూ, ఈ గడ్డపై పార్టీ జెండాను రెపరెపలాడించిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ఓటరుకు తాను రుణపడి ఉంటానన్నారు. ప్రతి ఒక్కరి పాదాలు తాకి కృతజ్ఞతలు సమర్పించకుంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. ప్రజల నమ్మకాన్ని తాను ఎన్నడూ వమ్ము చేయననని పళనిస్వామి పేర్కొన్నారు.ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అన్నాడీఎంకే రాజీలేని పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.
భవన నిర్మాణ కార్మికుడిపై దాడి
తిరువొత్తియూరు: చైన్నె సమీపం తాంబరం పీర్కంకరనైలో ఒక భవన నిర్మాణ కార్మికుడిపై టీవీకే పార్టీ నిర్వాహకుడు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది. పీర్పంకరనై పుత్తూర్ నగర్ ప్రాంతంలోని ఒక పాత భవనాన్ని కూలుస్తున్న సమయంలో టీవీకే పార్టీకి చెందిన జయకృష్ణన్ అనే నిర్వాహకుడు, కూలీలతో గొడవ పడి ఒక కార్మికుడిపై దాడి చేసినట్టు తెలిసింది. దాడికి సంబంధించిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. అందులో అతను కార్మికుడిని బెదిరిస్తూ దాడి చేయడం దృశ్యం రికార్డయ్యింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు, టీవీకే అధినేత విజయ్ ఆదేశాల మేరకు జయకృష్ణన్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం అన్ని బాధ్యతల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది.
రూ.20లక్షల నగదు చోరీ
తిరువొత్తియూరు: అంబత్తూరు పారిశ్రామిక ఎస్టేట్‌లో కారు సహా 17 సవర్ల బంగారం, రూ. 20 లక్షలు చోరీ చేసిన దొంగ నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. చైన్నెలోని అంబత్తూరు పారిశ్రామిక ఎస్టేట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో మనోజ్ (37) నివసిస్తున్నారు. ఈయన అదే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అంబత్తూరు పారిశ్రామిక ఎస్టేట్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఒక ఫిర్యాదు చేశారు. అందులో గత 23వ తేదీ రాత్రి తన నివాసం వద్ద నిలిపి ఉంచిన కారు కనిపించడం లేదు. కారులో 17 సవర్లు బంగారు నగలు, రూ. 20 లక్షల నగదును బ్యాగులో ఉంచి సీటు కింద దాచి ఉంచాను. తన కారును కనిపెట్టి ఇవ్వండి’ అని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా దశ్యాలను పరిశీలించారు. అలాగే అతని స్నేహితులు, అతని కంపెనీలో పనిచేసే ఉద్యోగులను కూడా విచారించారు. ఈ క్రమంలో మధురవాయల్ హైవే పక్కన ఉన్న మనోజ్ కారును శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కారులో ఉంచిన 17 సవర్ల నగలు రూ. 20 లక్షల నగదు మాయమైనట్లు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర
సంబంధం
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. నైవేలి సమీపం వడలూరు వద్ద ఒక మహిళ హత్యకు గురైంది. ఆమె మృతదేహం సగం పూడ్చిపెట్టిన స్థితిలో లభ్యమైంది. మృతురాలిని మంజులగా గుర్తించారు. హత్యకు సంబంధించి సంపత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంజుల, సంపత్ మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. తనను పెళ్లి చేసుకోవాలని మంజుల సంపత్‌ను ఒత్తిడి చేయడంతో, అతను ఆమెను హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకు న్నారు నిందితుడి నుంచి ఒక బంగారు గొలు సును, అతని ఇంట్లో ఉన్న మరికొన్ని నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సముద్ర తీరంలో పారేసిన మంజుల అనే మహిళకు చెందిన బ్యాగు, సెల్‌ఫోన్ వంటి వస్తువులను కీలక ఆధారాలుగా సేకరించారు. మంజులను బైకులో తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘటన జరిగిన 2గంటల వ్యవధిలోనే కడలూరు ఎస్పీ జయకుమార్ నాయకత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది. మృతురాలికి ఒక బిడ్డ కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
కొరుక్కుపేట: చైన్నెలోని టి.నగర్ ఎమ్మెల్యే, మంత్రి ఎన్.ఆనంద్ నియోజకవర్గ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ జరుపుతూ, వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి ఆనంద్ స్థానిక కోడంబాక్కంలోని 132వ వార్డులో కొత్తగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను స్వయంగా తనిఖీ చేసి, నిర్మాణ కార్మికుల ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.


