తిరువళ్లూరు: నూతనంగా నిర్మించిన బస్టాండు వెనక వున్న నివాసాలకు దారి ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరులో తిరువీకే బస్టాండు వుంది. ఇక్కడి నుంచే నిత్యం వందలాది బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అక్క డ నిత్యం ట్రాఫిక్ సమస్యలు రావడంతో నూతన బ స్టాండును నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రూ.36 కోట్ల వ్యయంతో నూతన బస్టాండును నిర్మించారు. 90 శాతం పనులు పూర్తయ్యాయి. పనులు పూర్తయిన క్రమంలో ఇటీవలే ప్రారంభించా రు. అయితే నూతన బస్టాండుకు వెనుక వున్న వంద నివాసాలు, సాయిబాబా ఆలయానికి దారి ఇవ్వకుండానే నిర్మాణాలను పూర్తి చేశారని ఆరోపిస్తూ శుక్రవా రం ఉదయం తిరువళ్లూరు–ఊత్తుకోట రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు దారి ఏర్పాటు చేసే విషయంలో న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.


