తెలుగు వారికి అండగా ఉంటా! | - | Sakshi
Sakshi News home page

తెలుగు వారికి అండగా ఉంటా!

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

తిరువళ్లూరు: గుమ్మిడిపూండి నియోజకవర్గంలోని తెలుగు వారికి తాను అండగా వుండడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆద ర్శవంతంగా తీర్చిదిద్దుతానని గుమ్మిడిపూండి అన్నాడీఎంకే అభ్యర్థి సుధాకర్‌ హామీ ఇచ్చారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి అన్నాడీఎంకే అభ్యర్థి సుధాకర్‌ను పార్టీ కూటమి నేతలకు పరిచయం చేసే కార్యక్రమం తండలంలో జరిగింది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ అభ్యర్థిని పరిచయం చేశారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. అనంతరం అభ్యర్థి సుధాకర్‌ మాట్లాడుతూ గుమ్మిడిపూండి నియోజకవర్గంలో ఎక్కువ మంది తెలుగు వారు నివాసం వుంటున్నారన్నారు. నియోజకవర్గంలో ప్రాథమిక అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. పీఎంకే నేత ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement