క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

వంద శాతం ఓటింగ్‌పై అవగాహన

తిరువళ్లూరు: జిల్లాలో వంద శాతం ఓటింగ్‌ నమోదు చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం దివ్యాంగులు, రైతులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. తిరువళ్లూరు కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాలను కలెక్టర్‌ ప్రతాప్‌ ప్రారంభించి ప్రసంగించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు వేసి నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు ఓటు హక్కును విధిగా భావించాలని కోరారు. అనంతరం వంద శాతం ఓటింగ్‌ నమోదు కావాలని కోరుతూ దివ్యాంగులు, రైతుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్నికల కార్యాలయం ప్రారంభం

తిరుత్తణి: తిరుత్తణిలో అన్నాడీఎంకే ఎన్నికల కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ కిరణ్‌ ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ద్వారా తిరుత్తణి అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ ఎంపీ హరి పోటీ చేస్తున్నారు. ఈక్రమంలో ఎన్‌డీఓ కూటమి పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలోని చిత్తూరు రోడ్డు జంక్షన్‌ వద్ద పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. అన్నాడీఎంకే అభ్యర్థి హరి సమక్షంలో బీజేపీ రాష్ట్ర ఉప కార్యదర్శి డాక్టర్‌ కిరణ్‌ ప్రారంభించా రు. ఈసందర్భంగా కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలను అభ్యర్థి హరి సత్కరించారు. అన్నాడీఎంకే పాలన కోసం అన్నాడీఎంకేను గెలిపించాలని, ఎన్నికల హామీలపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టాలని కోరారు. అన్నాడీఎంకే కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నీట మునిగి బాలుడి మృతి

తిరువళ్లూరు: సరదాగా ఈత కోసం వెళ్లిన పదవ తరగతి బాలుడు నీట ముని గి మృతిచెందిన సంఘటన విషాదాన్ని నింపింది. తిరువ ళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా దిగువముధలాంబేడు గ్రామానికి చెందిన బాబు కుమారుడు అభిషేక్‌ (15). ఇతను కవరపేటలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివి పబ్లిక్‌ పరీక్షలు రాశా డు. గురువారం పరీక్షలు పూర్తయిన క్రమంలో ఆరోజు మధ్యాహ్నం సహచరులతో కలసి క్రికెట్‌ ఆడి ఈత కొట్టేందుకు కుంటకు వెళ్లినట్టు తెలిసింది. అయితే ఈత కొడుతూ అభిషేక్‌ నీటి కుంటలో మునిగిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన సహచరులు అగ్నిమాపక సిబ్బంది, గుమ్మిడిపూండి పోలీసులకు సమా చారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు చెరువులో గాలించి గురువారం రాత్రి మృతదేహాన్ని వెలికి తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బెదిరింపు కేసులో

యూట్యూబర్‌ వరాహి అరెస్ట్‌

తిరువొత్తియూరు: అద్దెకు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమని కోరడంతో ఇంటి యజమాని అయిన మహిళను బెదిరించి, అసభ్యంగా, దూషించిన కేసులో యూట్యూబర్‌ వరాహిని మళ్లీ అరెస్ట్‌ చేశారు. ఆమైపె రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు.చైన్నె హైకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన వరాహి నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయడం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం, మహిళలను అసభ్యంగా వేధించడం వంటి మొత్తం 15 నేర కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం మళ్లీ అతడిని జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement