ప్రేమ కథాంశంతో బ్రేక్‌ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రేమ కథాంశంతో బ్రేక్‌ఫాస్ట్‌

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

తమిళసినిమా: అంబిక పతి అమరావతిల అమర ప్రేమ నుంచి ఇప్పటి ప్రేమల వరకు ప్రేమ విషయంలో మారుతున్న పరిణామాలను చూస్తున్నాం. మధ్యలో ప్రేమ విఫలమై గెడ్డాలు పెంచుకుని తిరిగిన వారిని చూశాం. ఇప్పుడు మనస్పర్థల కారణంగా బ్రేక్‌ అప్‌ చెప్పుకుంటున్న వారిని చూస్తున్నాం అలా ఈతరం ప్రేమికుల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం బ్రేక్‌ ఫాస్ట్‌ అని దర్శకుడు ఏఆర్‌ గాంధీకృష్ణ అన్నారు. ఈయన సుదీర్ఘ విరామం తరువాత దర్శకత్వం వహించిన చిత్రం బ్రేక్‌ఫాస్ట్‌. ప్రేమ్‌ క్లాసిక్‌ పిక్చర్స్‌ పతాకంపై గిరిజా వరదరాజ్‌ నిర్మించిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ద్వారా బిగ్‌ బాస్‌ ఫేమ్‌ రాణవ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ బ్యూటీ రోష్మిన్‌ నాయకిగా నటించిన ఈ చిత్రంలో మరో హీరోగా క్రితిక్‌మోహన్‌ నటించగా, నటి అర్చన, కస్తూరి, సంపత్‌ ముఖ్యపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతాన్ని, వైరముత్తు పాటలను అందించిన ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ నెలలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ శుక్రవారం చైన్నె లోని మార్క్‌ స్టూడియో మీడియాతో ముచ్చటించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చాల్సిన పరిస్థితులు నెల కొన్న సంస్కృతి, సంప్రదాయలకు ముప్పు వాటిల్లరాదు అని చెప్పే వైవిధ్య భరిత ప్రేమకథా చిత్రంగా బ్రేక్‌ఫాస్ట్‌ చిత్రం ఉంటుందని దర్శకుడు ఏఆర్‌.గాంధీకృష్ణ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె, మైసూరు ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. పాటలను కులుమనాలి వంటి మంచు ప్రదేశాలలో చిత్రీకరించినట్లు చెప్పారు. రాణవ్‌ మాట్లాడుతూ మలయాళంలో రెండు చిత్రాల్లో న టించానని, తమిళంలో నటించిన తొలి చిత్రం బ్రేక్‌ఫాస్ట్‌ అని రోష్మిన్‌ పేర్కొన్నారు.

దర్శకుడు గాంధీ కృష్ణతో యూనిట్‌ సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement