పా.రంజిత్‌ సంస్థలో జీవీ? | - | Sakshi
Sakshi News home page

పా.రంజిత్‌ సంస్థలో జీవీ?

Apr 4 2026 7:49 AM | Updated on Apr 4 2026 7:49 AM

తమిళసినిమా: సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డును అందుకోవడమే కాకుండా శత చిత్రాలను అధిగమించిన జీవీ ప్రకాష్‌కుమార్‌ నటుడిగాను రాణించడానికి కృషి చేస్తున్నారు. మొదట్లో డార్లింగ్‌ చిత్రంతో కథానాయకుడిగా మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత ఆ స్థాయి విజ యం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇటీవల నిర్మాతగారు మారిన జీవీ ప్రకాష్‌కుమార్‌ సరైన హిట్‌ అందుకోలేకపోయారు. కాగా ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన హ్యాపీరాజ్‌ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా కొత్త చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. పా రంజిత్‌ చిత్ర నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్‌్స్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పా రంజిత్‌ నిర్మించే కథ చిత్రాలు చాలా వైవిధ్యభరితంగా ఉంటాయన్నది తెలిసిందే. అంతేకాకుండా సమాజంలో జరుగుతున్న సంఘటనను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. దీనికి దర్శకుడు పా.రంజిత్‌ శిష్యుడు అకిరన్‌ మోసెస్‌ దర్శకత్వం వహించనున్న ట్లు తెలిసింది. అదేవిధంగా ఈ చిత్రానికి వైట్కె అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రక టన వెలువడ లేద న్నది గమ నార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement