వేలూరు: వేలూరు వీఐటీ పూర్వ విద్యార్థుల సంఘం భారత దేశంతోపాటు, ఐదు దేశాల్లో పూర్వ విద్యార్థులు విద్యార్థి సంఘం శాఖలను స్థాపించింది. ఆమేరకు 22వ శాఖ గురువారం లక్నోలో ప్రారంభించారు. వీఐటీ చాన్స్‌లర్ జి విశ్వనాథన్ అధ్యక్షత వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖా మంత్రి అనిల్‌రాజ్‌పర్, బీజేపీ ఎమ్మె ల్యే నీరజ్‌బోరా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి ఎంకే షణ్ముఖ సుందరం, ఐపీఎస్ అధికారి జీకే గోస్వామి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి హెచ్.రాజమోహన్ కూడా పాల్గొన్నారు. వీఐటీ ఉప కులపతి శంకర్‌విశ్వనాథన్‌న్, అసోసి యేట్ వైస్ చాన్స్‌లర్ పార్థసారథి మల్లిక్, వీఐటీ మాజీ విద్యార్థుల సంఘం డైరెక్టర్ కార్తికేయన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయమై వీఐటీ చాన్స్‌లర్ జి.విశ్వనాథ్ మాట్లాడుతూ. లక్నోలో వీఐటీ పూర్వ విద్యార్థుల సంఘం మొదటి శాఖ ప్రారంభించారు. దీనికి భారతదేశం అంతటా 22 శాఖలు ఉన్నాయి. అమెరికా, సింగపూర్, మలేషియాసహా విదేశాల్లో 41 శాఖలు ఉన్నాయి. దేశ విదేశాల్లో మొత్తం 63 పూర్వవిద్యార్థుల సంఘం శాఖలు ఉన్నాయని తెలిపారు.


