తిరుత్తణి: తిరుత్తణి టీవీకే అభ్యర్ధి సత్యకుమార్‌ను పార్టీ క్యాడరే పట్టించుకోకపోవడంతో పట్టణంలో ఒంటరిగా ప్రచారం చేస్తున్నారు! అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ ఆధ్వర్యంలో టీవీకే పార్టీ 234 స్థానాల్లోనూ ఒంటిరి పోరాటానికి అభ్యర్థులను బరిలో దింపింది. యువత పాలోయింగ్‌తో అధికార, ప్రతిపక్షాలకు గట్టిపోటీ ఇస్తామనుకుంటున్న టీవీకే తిరుత్తణి అభ్యర్థిగా చైన్నెకు చెందిన న్యాయవాది సత్యకుమార్‌ను పోటీకి దింపారు. అయితే ఇతర ప్రాంతాలకు చెందిన వారిని అభ్యర్థులుగా ప్రకటించడంతో తిరుత్తణిలో టీవీకేలో వ్యతిరేకత రాజుకుంది. అభ్యర్థికి ప్రజల నుంచి ఆదరణ లేకపోవడంతో ఒంటరిగా నామినేషన్ దాఖలు చేవారు. పార్టీ క్యాడర్ దూరమైనా సరే విజయ్‌ను నమ్ముకున్న లక్షలాది హృదయాలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో తిరుత్తణిలో ఒంటరిగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.


