కాణిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన గోశాలకు శుక్రవారం చైన్నెకు చెందిన శ్రీరంగం మిల్క్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున శ్రీనివాసులు నాయుడు 200 బస్తాల పశు దాణాను విరాళంగా అందజేశారు. దీని విలువ సుమారు రూ.2 లక్షలని ఆయన చెప్పారు. దేవస్థానం అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, గోశాల ఏఈఓ ధనుంజయ, సూపరింటెండెంట్ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.


