తిరువళ్లూరు: పట్టణంలోని ఉమ్మడి కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బాంబు బెదిరింపులతో కలకలం రేపింది. తిరువళ్లూరులో ఉమ్మడి కోర్టు భవనం వుంది. ఇక్కడ జిల్లా కోర్టు, జ్యుడిషియల్, సివిల్, లోక్‌అదాలత్‌తోపాటు పలు కోర్టులు వున్నాయి. ఈక్రమంలో కోర్టుకు బాంబు పెట్టినట్టు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్టు ఎస్పీ వివేకానంద శుక్లాకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే బాంబు స్క్వాడ్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం నాల్గవ సారి కావడం గమనార్హం.


