స్టాలిన్‌కు ఎందుకు అంత కోపం? | - | Sakshi
Sakshi News home page

స్టాలిన్‌కు ఎందుకు అంత కోపం?

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

● పళణిస్వామి విమర్శ

సాక్షి,చైన్నె: మహిళలపై జరుగుతున్న అఘాయితాలు, నేరాలకు సంబంధించి గణాంకాలు చెబితే స్టాలిన్‌కు కోపం వస్తోందని అన్నాడీఎంకే ప్రదానకార్యదర్శి పళణి స్వామి శివాలెత్తారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి గురువారం ధర్మపురిలో విస్తృతంగా పర్యటించారు. వివరాలు.. ధర్మపురి అన్నాడీఎంకేకు కోట వంటిదని, ఇక్కడ అన్నాడీఎంకే–పీఎంకే కూటమి అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేస్తూ పళణి స్వామి ప్రసంగించారు. పాలకోడ్‌ అభ్యర్థి కె.పి. అన్బళగన్‌, ధర్మపురి పీఎంకే అభ్యర్థి (అన్బుమణి సతీమని) సౌమ్య తదితరులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మహిళల భద్రతపై గణాంకాలతో దాడి

ఈరోడ్‌ ప్రచారంలో స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలకు పళణి కౌంటర్‌ ఇచ్చారు. తమిళనాడులో మహిళల భద్రత అద్బుతమని స్టాలిన్‌ అబద్ధాలు చెబుతున్నారన్నారు. కానీ వారి ప్రభుత్వ గణాంకాలే వేరేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన లైంగిక నేరాల కేసులకు సంబంధించిన వారి ప్రభుత్వ గణాకాలలోని ఈ నిజాన్ని చెబితే స్టాలిన్‌కు కోపం వస్తోందన్నారు. అన్నానగర్‌ బాలిక కేసులో నిందితులను కాపాడేందుకు డీఎంకే ప్రభు త్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని ఆరోపించారు.

మత్తు పదార్థాల అడ్డా

తమిళనాడు ఇప్పుడు గంజాయి, మత్తు పదార్థాల కు అడ్డాగా మారిందని, దీనివల్లే నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలోనే డీఎంకే ప్రభుత్వం 5 లక్షల కోట్ల అప్పు చేసిందని దుయ్యబట్టారు. ఈసందర్భంగా తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలను పళని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement