డీఎంకే అభ్యర్థి కాలుపై పడి ఆశీర్వాదం | - | Sakshi
Sakshi News home page

డీఎంకే అభ్యర్థి కాలుపై పడి ఆశీర్వాదం

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

● చర్చనీయాంఽశంగా మారిన అన్నాడీఎంకే అభ్యర్థి వ్యవహారశైలి

తిరువళ్లూరు: నామినేషన్‌ వేయడానికి వచ్చిన సమయంలో ఎదురుపడ్డ తన ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి టిజే గోవిందరాజన్‌ కాలుపై పడి అన్నాడీఎంకే అభ్యర్ది సుధాకర్‌ ఆశీర్వాదం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్‌ 23న జరగనుంది. ఇప్పటికే నామినేషన్‌ల ప్రక్రియ సైతం ఊపందుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని పొన్నేరిలో కాంగ్రేస్‌ అభ్యర్థి, ఆవడిలో బిజేపి అభ్యర్దులు తప్ప మిగిలిన వారిని ప్రధాన పార్టీలు ప్రకటించి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి అన్నాడీఎంకే అభ్యర్దిగా సుధాకర్‌, డీఎంకే అభ్యర్ధిగా, టి.జె.గోవిందరాజన్‌, టివీకే అభ్యర్ధిగా విజయకుమార్‌ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్ధిలు గుమ్మిడిపూండిలోని తాలుకా కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్‌ను దాఖలు చేశారు. డీఎంకే అభ్యర్థిధ గోవిందరాజన్‌ కూటమి నేతలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేసి బయటకు వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన అన్నాడీఎంకే అభ్యర్థి సుధాకర్‌ ఆయనతో కరచాలనం చేశారు. అనంతరం టీజే గోవిందరాజన్‌ కాలుకు మొక్కి ఆశీర్వాధం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement