సేలం: ఈరోడ్‌లోని చెన్నిమలైలోని మురుగన్ ఆలయంలో పంగుణి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా, తెల్లవారుజామున కై లాసనాథర్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రథాన్ని సిద్ధం చేశారు. అనంతరం ఉదయం 6.10 గంటలకు రథయాత్ర జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, రథాన్ని లాగుతూ ఉత్తర రాజా వీధి కూడలి వద్ద నిలిపివేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు, తాడు లాగి రథాన్ని మళ్లీ నిలిపివేశారు. రథయాత్ర సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి పాదాల వద్ద భక్తులకు ప్రసాదం సమర్పించారు. గురువారం ఉదయం 9 గంటలకు పరివేట్టై కార్యక్రమం, సాయంత్రం 7 గంటలకు తెప్పోత్సవం జరుగుతాయి. ఉత్సవానికి చెన్నిమలై ధర్మకర్తల కమిటీ చైర్మన్ పళనివేల్, సభ్యులు మనోహరన్, బాలసుబ్రహ్మణ్యం, ఆలయ కార్యనిర్వహణాధికారి శరవణన్, సూపరింటెండెంట్ మాణిక్యం పాల్గొన్నారు.


