కాట్పాడిలో మంత్రి దురై మురుగన్‌ ప్రచారం | - | Sakshi
Sakshi News home page

కాట్పాడిలో మంత్రి దురై మురుగన్‌ ప్రచారం

Apr 2 2026 7:41 AM | Updated on Apr 2 2026 7:41 AM

వేలూరు: కాట్పాడి నియోజక వర్గాన్ని ఆలయంగా భావించి అభివృద్ధి చేశానని మంత్రి దురై మురుగన్‌ అన్నారు. వేలూరు జిల్లా కాట్పాడి నియోజక వర్గం డీఎంకే అభ్యర్థిగా మంత్రి దురై మురుగన్‌ను ప్రకటించారు. దీంతో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పరిచయ వేదిక జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాదారణంగా రాజకీయ పార్లీ అధికారంలోకి వచ్చిప్పుడు మేం ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పుకుంటూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తుంటాయన్నారు. అయితే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతనే ప్రజల నుంచి ఓట్లు కోరే నాయకుడు సీఎం స్టాలిన్‌ మాత్రమే అన్నారు. మహిళలకు నెలకు రూ. 1000 ఇస్తామని ప్రకటించినప్పడు అది అసాధ్యమని విమర్శించారని అయినప్పటికీ ఈ పథకాన్ని విజయ వంతంగా సాదించి అమలు చేశామన్నారు. కాట్పాడి నియోజక వర్గంలో తాను 1971వ సంవత్సరంలో మొదటిసారిగా ఎన్నికల్లో ప ఓటీ చేసినప్పుడు ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే వారని కాట్పాడి రైల్యే స్టేషన్‌కు వెళ్లి రైలులో వచ్చే నీటిని పట్టుకు వచ్చేవారని వీటిని గుర్తించి తాను కావేరి తాగునీటి పథకాన్ని మొదటగా తీసుకొచ్చి ప్రస్తుతం వేలూరు జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పొన్నై నదిలో అనేక సంవత్సరాలుగా చెక్‌డ్యామ్‌ లేకు రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిని రూ: 48 కోట్ల వ్యయంతో బృహత్తర వంతననె నిర్మించడం జరిగిందన్నారు. మోర్ధానా డ్యామ్‌, కాట్పాడి నియోజక వర్గంలో అసరమైన అన్ని పథకాలను తీసుకొచ్చిన ఘనత తనకే దక్కిందన్నారు. కాట్పాడి ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఆదరించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందే విధంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఎంపీ కదీర్‌ఆనంద్‌, జిల్లా కోశాధికారి నరసింహన్‌, ఉత్తర ప్రాంత కార్యదర్శి వన్నియరాజ, పుష్పలత, కాట్పాడి యూనియన్‌ కార్యదర్శి శరవణన్‌, తనిగాచలం, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement