నాట్‌ హెల్త్‌ అధ్యక్షురాలిగా డాక్టర్‌ సంగీతారెడ్డి | - | Sakshi
Sakshi News home page

నాట్‌ హెల్త్‌ అధ్యక్షురాలిగా డాక్టర్‌ సంగీతారెడ్డి

Mar 28 2026 7:52 AM | Updated on Mar 28 2026 7:52 AM

సాక్షి, చైన్నె: భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత సంస్థ నాట్‌హెల్త్‌(ఎన్‌ఏటీహెచ్‌ఈఏఎల్‌టీహెచ్‌)కు 2026–27 ఆర్థిక సంవత్సరానికి నూతన నాయక త్వ బృందాన్ని శుక్రవారం ప్రకటించా రు. చైన్నెలో జరిగిన నాట్‌హెల్త్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న అమీరా షా (మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌) స్థానంలో నియమితులయ్యారు.

కొత్త నాయకత్వ బృందం

నాట్‌ హెల్త్‌కు అధ్యక్షురాలిగా డాక్టర్‌ సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా హిమాన్షు బైద్‌ (మేనేజింగ్‌ డైరెక్టర్‌, పాలీ మెడిక్యూర్‌ లిమిటెడ్‌), వైస్‌ ప్రెసిడెంట్‌గా వరుణ్‌ ఖన్నా(గ్రూప్‌ ఎం.డి, క్వాలిటీ కేర్‌ ఇండియా లిమిటె డ్‌) ఎంపికయ్యారు. బాధ్యతలు స్వీక రించిన అనంతరం డాక్టర్‌ సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతదేశం వికసిత్‌ భారత్‌–2047 దిశగా అడుగులు వేస్తు న్న తరుణంలో వైద్యం కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం కాకుండా నివారణ, రోగుల భద్రతకు పెద్దపీట వేసేలా మారాలని ఆకాంక్షించారు. ప్రాథమిక చికిత్సను బలోపేతం చేయడం, బీమా సౌకర్యాన్ని విస్తరించడం, డిజిటల్‌ హెల్త్‌ ప్లాట్‌ఫారంలను ఉపయోగించుకోవడం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించవచ్చునని వివరించారు. తన తండ్రి డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ప్రతి భారతీయుడికి అందుబాటు ధరలో, అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం, పరిశ్రమల మధ్య వారధిగా నాట్‌హెల్త్‌ పనిచేస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement