దేశ భద్రతలో సాయుధ దళాల సమన్వయమే కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశ భద్రతలో సాయుధ దళాల సమన్వయమే కీలకం

Mar 25 2026 7:21 AM | Updated on Mar 25 2026 7:21 AM

ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌

సాక్షి, చైన్నె: మారుతున్న యుద్ధ తంత్రాలు, ఎదురవుతున్న కొత్త భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే భారత త్రివిధ దళాల మధ్య పరస్పర సమన్వయం అత్యంత కీలకమని చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీఐఎస్‌సీ) ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ స్పష్టం చేశారు. నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ ని ఆయన సందర్శించారు. ఇక్కడ 81వ స్టాఫ్‌ కో ర్సులో శిక్షణ పొందుతున్న భారతీయ, మిత్ర దేశా ల సైనిక అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

మారుతున్న యుద్ధ ముఖచిత్రం

ఆధునిక కాలంలో యుద్ధం స్వభావం మారుతోందని, దానికి అనుగుణంగా వ్యూహాలు కూడా మారాలని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న వ్యూహాత్మక సవాళ్లపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. సైన్యం , నావికాదళం , వాయుసేన మధ్య శ్రీజాయింట్‌నెస్‌శ్రీ , ఐక్యత ఉంటేనే ఎలాంటి భద్రతా ముప్పునైనా తిప్పికొట్టగలమని స్పష్టం చేశారు.

సైనిక సంస్కరణలు

భారత సైనిక వ్యవస్థలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు , సంస్కరణల గురించి అధికారులకు వివరించారు. భవిష్యత్తు సైనిక నాయకులు నిరంతరం మారుతున్న పరిస్థితులకు అలవాటు పడాలని పిలుపునిచ్చారు. భావి సైనిక నాయకులను తీర్చిదిద్దడంలో వెల్లింగ్టన్‌ పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. వృత్తిపరమైన సైనిక విద్య అనేది కార్యకలాపాల సంసిద్ధతను, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఈ సందర్శనలో భాగంగా కాలేజీ కమాండెంట్‌, ఎయిర్‌ మార్షల్‌కు ప్రస్తుతం కొనసాగుతున్న శిక్షణా కార్యక్రమాల గురించి , త్రివిధ దళాల మధ్య అవగాహన పెంచేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement