కొరుక్కుపేట: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ –వడపళని క్యాంపస్ల్‌ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం రోబోటిక్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్సాన్ 2026 న్యూరోబోటిక్స్ పేరుతో జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. రెండు రోజుల పాటూ నిర్వహించిన ఈ సదస్సు మంగళవారం ముగిసింది. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన విద్యార్థులకు వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని సజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ టెక్ ఫస్ట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెకాట్రానిక్స్ వంటి అంశాలపై టెక్నికల్ పేపర్ ప్రజెంటేషన్లు, అలాగే పేపర్ ప్రజెంటేషన్, డీకోడ్ రియాలిటీ, రోబో వార్, లైన్ ఫాలోయర్, బ్రెయిన్ వేవ్ వంటి టెక్నికల్ పోటీలతో పాటు, విద్యార్థుల సాంకేతిక, సాంకేతికేతర నైపుణ్యాలను పరీక్షించడానికి అనేక రకాల నాన్–టెక్నికల్ కార్యకలాపాలు కూడా చేపట్టారు. ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎ. షిర్లీ ఎడ్వర్డ్ సభికులకు స్వాగతం పలికారు. డీన్ డాక్టర్ సి.వి. జయకుమార్ అభినందన ప్రసంగం చేశారు. వైస్ ప్రిన్సిపాల్ (అకాడమిక్స్ అండ్ ప్లేస్‌మెంట్స్) డాక్టర్ సి. గోమతి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, చైన్నెకి చెందిన ఇన్ఫాంట్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖరన్ ఎస్. ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను అభినందించారు. రోబోటిక్స్ క్లబ్ విద్యార్థుల బందం రూపొందించిన మానవ హస్త ముద్రలతో నియంత్రించే రోబోట్లు , డిజిటల్ ట్విన్ ఇంప్లిమెంటేషన్ ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది .ప్రపంచవ్యాప్తంగా రోబోటిక్స్ రంగంలో జరుగుతున్న పరిశోధన , అభివద్ధి, దాని బహుళ విభాగాల స్వభావం గురించి డాక్టర్ రాజశేఖరన్ ప్రసంగం చేశారు. విజేతలకు సర్టిఫికెట్లతో పాటూ ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేశారు.


