వేలూరు: వేలూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఈవీఎం మిషన్‌లను పంపిణీ చేసే పనులను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ముందుగా ఈవీఎం మిషన్‌లు ఉన్న గోడౌన్ తెరిచి పరిశీలించారు. వేలూరు జిల్లాలోని కాట్పాడి అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 280 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌కు ఉపయోగించునున్న 336 ఈవీఎం మిషన్‌లు, నియంత్ర ప రికరాలు, ఓట్ల లెక్కింపు వీవీపి ఇడి లెక్కింపు యంత్రాలు, వేలూరు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 268 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌కు గాను 321 ఈవీఎం మిషన్‌లు, అనకట్టు నియోజక వర్గాల్లోని 295 పోలింగ్ కేంద్రాల్లోను 354 ఈవీఎం మిషన్‌లు, కేవీ కుప్పం అసెంబ్లీ నియోజక వర్గాల్లోని 265 పోలింగ్ కేంద్రాల్లోను 316 ఈవీఎం మిషన్‌లు, గుడియాత్తం నియోజక వర్గాల్లో 319 పోలింగ్ కేంద్రాల్లో ను 382 ఈవీఎం మిషన్‌లు, కంట్రోలింగ్ మిషన్‌లు, వీవీపెడ్ యంత్రాలు మొత్తం 1,428 పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించునున్న 1,711 ఈవీఎం మిషన్‌లు , కంట్రోలింగ్ మిషన్‌లు తదితర వాటిని పంపే పనుల్లో నిమగ్నమయ్యారు. వీటిని ఆయా నియోజక వర్గాల్లోని కంట్రోల్ రూమ్‌లో భద్ర పరచనున్నారు. కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారులు శివసుబ్రమణియన్, ప్రత్యేక అధికారి బాస్కరన్, ఎన్నికల అధికారులు అసిస్టెంట్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


