ముమ్మరంగా వాహనాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా వాహనాల తనిఖీ

Mar 25 2026 7:20 AM | Updated on Mar 25 2026 7:20 AM

తిరువళ్లూరు: ఎన్నికల్లో నగదు పంపిణీని అరికట్టడానికి నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో భాగంగా మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో 6.10 లక్షల నగదు, 45 సవర్ల బంగారు నగలను స్పెషల్‌ టీమ్‌ స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించింది. వివరాలు.. ఎన్నికల్లో నగదు, బంగారుతో పాటు ఇతర వస్తువుల పంపిణీని అరికట్టడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గానికి మూడు టీమ్‌ల చొప్పును జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గానికి 30 టీమ్‌ల చొప్పున ఏర్పాటు చేసి షిప్టు పద్ధతిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మప్పేడు వద్ద ఎస్‌ఎస్‌టీ టీమ్‌ నిర్వహించిన వాహన తనీఖీల్లో 45 సవర్ల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మప్పేడు వద్ద స్పెషల్‌టీమ్‌ కుమరేషన్‌ అనే వ్యక్తి నుంచి 1.14 లక్షల నగదు,పట్రపెరంబదూరు వద్ద నిర్వహించిన తనీఖీల్లో 3.60 లక్షల నగదు, పేరంబాక్కం వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.60 వేల నగదుతో పాటూ మొత్తం రూ.6.10 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం ఉన్నత అధికారులకు సిఫార్సు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement