సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఉచితంగా ప్రచార ప్రసార సమయం కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ మేరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో ఉచిత ప్రసార సమయాన్ని కేటాయిస్తూ డిజిటల్ ఓచర్లను జారీ చేసింది.
రాజకీయ పార్టీలకు ఉచిత ప్రచార సమయం
ప్రతి గుర్తింపు పొందిన పార్టీకి దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో రెండింటిలోనూ 45 నిమిషాల కనీస సమయం కేటాయించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల పనితీరు ఆధారంగా అదనపు సమయాన్ని కేటాయించనున్నారు. అభ్యర్థుల తుది జాబితా ప్రచు రణ నుండి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు ఈ ప్రసారాలు ఉంటాయి. దీనికి సంబంధించిన డ్రాను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహిస్తారు. అలాగే ప్రసార భారతి ఆధ్వర్యంలో దూరదర్శన్, రేడియోలలో రెండు చర్చా కార్యక్రమాలకు అవకాశం కల్పించనున్నారు. దీనికి ప్రతి పార్టీ ఒక ప్రతినిధిని నామినేట్ చేయవచ్చు.
భారీగా నగదు, బంగారం స్వాధీనం
ఎన్నికల వేళ అక్రమాలను అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 24 గంటలు నిఘా ఉంచాయి. సోమవారం నాటికి రూ. 151 కోట్లు సీజ్ చేశారు. ఇందులో నగదు రూ. 30 కోట్లు ఉండగా, 92. కోట్ల వస్తువులు ఉన్నాయి. సోమవారం చైన్నె శివారులోని పోరూ ర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో ఏకే 47 తుపాకులు బయట పడడం కలకలం రేపింది. చివరకు అవి ఓ చిత్ర షూటింగ్ నిమిత్తం తరలిస్తున్న డమ్మీ తుపాకు లుగా తేలాయి. చైన్నె శివారులోని మాధవరంలో ఓ వా హనంలో రూ. 50 లక్షలు సీజ్‌చేశారు. నాగర్ కోయి ల్‌లో పెద్దఎత్తున కుట్టు మిషన్లు పట్టుబడ్డాయి. అలాగే, ఓ చోట పెద్దఎత్తున బంగారం పట్టుబడగా, అది ఓ జ్యువెలరీకి చెందినదిగా గుర్తించారు.
ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్
ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని సులభంగా గుర్తించేలా సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ స్పష్టంగా కనిపించేలా బూత్ స్లిప్‌ను మార్చారు.మొబైల్ డిపాజిట్ సౌకర్యం కోసం పోలింగ్ కేంద్రం వద్ద పిజియన్ హోల్ బాక్స్ లేదా జ్యూట్ బ్యాగుల సౌకర్యాన్ని కల్పించేందుకు నిర్ణయించారు. ఓటరు నమోదు, ఈపీఐసీ కార్డు సవరణలు, పోలింగ్ కేంద్రం వివరాల కోసం 40కి పైగా అప్లికేషన్లను కలిపి ఈసీఐఎన్‌ఈటీ అనే ఒకే పోర్టల్, యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.


