అరకొర రోడ్డు పనులు వద్దని ధర్నా | - | Sakshi
Sakshi News home page

అరకొర రోడ్డు పనులు వద్దని ధర్నా

Mar 23 2026 8:34 AM | Updated on Mar 23 2026 8:34 AM

వేలూరు: నాణ్యమైన తారు రోడ్డు పనులు చేయాలని కోరుతూ వేలూరు కార్పొరేషన్‌ పరిధిలోని 48వ వార్డు అల్లాపురం వాసులు ధర్నా నిర్వహించారు. తమిళనాడు మహి ళా న్యాయవాదుల సంఘం జిల్లా కార్యదర్శి జయశ్రీ దేవి మాట్లాడుతూ 48వ వార్డు పరిధిలో రెండు కార్పొరేట్‌ ప్రవే టు పాఠశాలలు ఉన్నాయని దీంతో రోజూ ఉదయం,సాయంత్రం వేలల్లో పాఠశాల బస్సులతో పాటు పాఠశాలకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు అనే ఎప్పుడూ ఈ రోడ్డు రద్దీగా ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోసం తారు రోడ్డు పనులను తమమ ప్రాంతంలో చేస్తున్నారని వీటిలో ఏ మాత్రం నాణ్యత లేకుండా గతంలో ఉన్న రోడ్డుపైనే తారు రోడ్డును వేస్తున్నారన్నారు. పనులు నాణ్యత లేకుండా వేసే తారు రోడ్డు తమకు వద్దని తేల్చిచెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్‌తో పాటూ జిల్లా అధికారులు ఈ ప్రాంతంలో ఓటు వేసేందుకు వస్తారని కాంట్రాక్టర్‌లు అరకొరగా రోడ్డు పనులు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ ఐదవ జోన్‌ అధ్యక్షులు మనోహరన్‌, మక్క్‌ల్‌ నీధి మయం ఏరియా ఇన్‌చార్జీ గణేష్‌, అటవీశాఖ రిటైర్డ్‌ రేంజ్‌ అధికారి విజయకుమార్‌, స్థానికులు మోహన్‌, శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement